తన స్పీచ్ లతో అభిమానులనే కాక తారలను సైతం విస్మయపరిచే దర్శకుడు బండ్ల గణేష్. ఆడియో విడుదల వేడుకలలో హృదయపూర్వకంగా మాట్లాడి మధ్యమధ్యలో భావోద్వేగాలకు గురవుతూవుంటాడు
నిన్న జరిగిన ‘గోవిందుడి’ ఆడియో విడుదల వేడుకలో కూడా ఇటువంటి పరిస్థితే చోటు చేసుకుంది. తన స్పీచ్ లో చిరంజీవి, చరణ్ లని సదా స్మరిస్తూ వచ్చాడు. చరణ్ ఒక కోహినూర్ డైమండ్ గా అభివర్ణింపబడ్డాడు. నిర్మాతలకోసం, అభిమానుల కోసం నిరంతరం తపించే కొడుకుని కన్న శ్రీమతి సురేఖ గారికి పదేపదే కృతజ్ఞతలు తెలిపాడు
బండ్ల గణేష్ స్పీచ్ లో కొన్నిసార్లు చిరు, చరణ్ లు సిగ్గుపడ్డా ఆద్యంతం ఆయన స్పీచ్ ని ఎంజాయ్ చేసారన్న మాట వాస్తవం


