
మీడియా ముందు ‘లింగ’ సినిమా గురించి మాట్లాడడం.. విమర్శించడం… రజినీకాంత్ ప్రస్తావన తీసుకురావడం… ఆందోళనలు చేపట్టడం.. వంటి చర్యలపై కోర్ట్ నిషేధం విధించింది.సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ’ సినిమా ఘోర పరాజయం పాలవడంతో.. తమ నష్టాలను నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, అతని నిర్మాణ సంస్థ భర్తీ చేయాలని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనలు చేపట్టిన సంగతి విదితమే. నిరాహార దీక్షకు సిద్దమయ్యారు.
ఈ పరిణామాలపై నిర్మాత వెంకటేష్ ఈ నెల 20వ తేదీన బెంగుళూరు కోర్టులో కేసు వేశారు. డిస్ట్రిబ్యూటర్లు రజినీకాంత్ పరువును బజారు కీడుస్తున్నారు. డబ్బులు చెల్లించాలని నా నిర్మాణ సంస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తమ చర్యలతో వేధిస్తున్నారు అని వెంకటేష్ పేర్కొన్నారు. ఈ కేసులో బెంగుళూరు కోర్ట్ నిర్మాతకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.గతంలో తమిళ చిత్ర నిర్మాతల మండలి, నటీనటుల సంఘం రజినీకాంత్, నిర్మాతకు బాసటగా నిలిచారు. డిస్ట్రిబ్యూటర్లు చర్యలను తీవ్రంగా ఖండించారు.