రోడ్ పై క్యాజువల్ వాక్, వైరల్ అవుతున్న బన్నీ పిక్

Published on Jun 2, 2020 2:44 pm IST

దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తరువాత అల వైకుంఠపురంలో మూవీతో వచ్చిన బన్నీ సాలిడ్ హిట్ అందుకున్నాడు. బన్నీ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన ఆ చిత్రం నాన్ బాహుబలి రికార్డు నమోదు చేసింది. ఇక బన్నీ నెక్స్ట్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాడు. దర్శకుడు సుకుమార్ తో ఆయన పుష్ప మూవీ చేస్తున్నారు. ఈ మూవీ కోసం బాగా జులపాలు పెంచారు. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో బన్నీ మొరటు లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నాడు.

కాగా లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. బన్నీ తన వ్యక్తి గత భద్రతా సిబ్బందితో రోడ్ పై క్యాజువల్ వాక్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లాక్ డౌన్ నిబంధనల వలన రోడ్లపై రద్దీ తక్కువగా ఉండగా, బన్నీ అలా ఆటవిడుపుగా బయటికి వచ్చినట్లున్నారు. గతంలో కూడా బన్నీ లాక్ డౌన్ సమయంలో స్వయంగా సూపర్ మార్కెట్ కి వెళ్లి షాపింగ్ చేశారు.

సంబంధిత సమాచారం :

More