కొంటె బొమ్మల బాపుకి మరో అరుదైన పురష్కారం

కొంటె బొమ్మల బాపుకి మరో అరుదైన పురష్కారం

Published on Mar 11, 2013 3:05 PM IST

bapu

తన కుంచెతో, సృష్టిలోని రంగులతో అద్భుతమైన బొమ్మలను, అలాగే రామాయణాన్ని బొమ్మల రూపంలో చెప్పిన కొంటె బొమ్మల బాపుకి మరో అరుదైన పురష్కారం దక్కింది. ఒక్క కళా రంగంలోనే కాకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి సుమారు 51 సినిమాలకు దర్శకత్వం వహించిన బాపుకి ప్రభుత్వం ‘విశ్వ విఖ్యాత దర్శక మహర్షి’ బిరుదుతో సత్కరించారు. నిన్న మహా శివరాత్రి సందర్భంగా సాయం సంధ్యా సమయాన విశాఖ సముద్ర తీరాన ఏర్పాటు చేసిన వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామి రెడ్డి ఈ సత్కారాన్ని బహుకరించారు. బాపు గారు అనారోగ్యం కారణం వల్ల వేడుకకి రాకపోయినా ఆయన కుమారుడు వెంకటరమణ ఈ పురష్కారాన్ని అందుకున్నాడు.

ఈ వేడుకలో సుబ్బా రామి రెడ్డి మాట్లాడుతూ ‘ఈ సత్కారానికి బాపు గారు ఎ మాత్రం తక్కువ కాదు ఎందుకంటే బాపు గారు ఒక్క చిత్ర కళా కారుడిగానే కాక దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన అచ్చతెలుగు సినిమాలు తీసారు. తెలుగు సినిమాకు బాపు – కె. విశ్వనాథ్ రెండు కళ్ళు లాంటి వాళ్ళని అన్నారు. ఈ వేడుకకి సినీ నటులైన డా. మోహన్ బాబు, కమెడియన్ బ్రహ్మానందం, వాణీ శ్రీ తదితరులు హాజరయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు