
మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా లాంచ్ అయిన హీరో వరుణ తేజ్, విలక్షణ దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ‘కంచె’. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందేజగద్గురుమ్’ ఇలా బలమైన కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలని తపించే క్రిష్, కంచె సినిమాను అందరూ ఆశ్చర్యపోయాలా రూపొందించారనే టాక్ వినబడుతోంది. ఇక అందుకు తగ్గట్టుగానే ఈమధ్యే విడుదలైన టీజర్ అందరినీ కట్టిపడేసింది. 50 సెకండ్ల లోపే ఉన్న ఈ టీజర్‌తో సినిమాపై ఇప్పటివరకూ ఉన్న అంచనాలు చాలారేట్లు పెరిగిపోయాయ్!
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడిచే ఈ సినిమాకు అప్పటి మూడ్‌ను తీసుకురావడానికి దర్శకుడు క్రిష్ చాలా కృషి చేశారు. యుద్ధ నేపథ్యంలో నడిచే సినిమా కావడంతో, సినిమా కాలానికి సంబంధించి యుద్ధంలో వాడిన ట్యాంకర్లు, ఆయుధాలు, తుపాకులు తదితర విషయాలపై చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో యుద్ధం జరిగే సమయంలో వచ్చే కొన్ని సన్నివేశాలు అందరినీ కట్టిపడేసేలా ఉన్నాయని సమాచారం. క్రిష్ ప్రతీ సినిమాలో ఉండే బేసిక్ ఎమోషన్‌తో పాటు ఈ ఎపిసోడ్స్ కూడా హైలైట్‌గా నిలవనున్నాయని సమాచారం. వరుణ్ తేజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించారు.