‘భలే భలే మగాడివోయ్’ ప్రమోషన్స్‌తో నాని బిజీ

Bhale-Bhale-Magadivoy
నాని సినిమా అంటే తెలుగు సినీ అభిమానులకు ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. ఓ మంచి కథ, ఆసక్తికరమైన సాఫ్ట్ కామెడీ నాని సినిమాల్లో సాధారణంగా కనిపిస్తూంటాయి. ఈ ప్రత్యేకతలే తెలుగు సినీ పరిశ్రమలో నానికి హీరోగా ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. తాజాగా ఆయన తెలుగులో చిన్న సినిమాలకు ఒక ఐడెంటిటీ కల్పించిన దర్శకుడు మారుతీతో కలిసి ‘భలే భలే మగాడివోయ్’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక సినిమా విడుదలకు ఇంకా వారం రోజులే ఉండడంతో భలే భలే మగాడివోయ్ యూనిట్ అన్నిచోట్లా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సోషల్ మీడియాలో ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతుండగా, నేటినుంచి నాని, దర్శకుడు మారుతి, హీరోయిన్ లావణ్యలు పలు టీవీ చానల్ ఇంటర్వ్యూలు, పత్రికా ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియో సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తించగా, సినిమాపై యూత్‌లో విపరీతమైన అంచనాలున్నాYఇ. ఇక ఈ అంచనాలను ఏమాంత్రం తగ్గకుండా సినిమా ఉండనుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.

Exit mobile version