సెన్సార్ పూర్తిచేసుకున్న ‘బ్యూటిఫుల్’ !

సెన్సార్ పూర్తిచేసుకున్న ‘బ్యూటిఫుల్’ !

Published on Dec 4, 2019 10:58 PM IST

టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక). నైనా కథానాయిక కాగా సూరి కధానాయకుడిగా నటించారు. అగస్త్య మంజు దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎలాంటి కట్స్ లేకుండా `ఎ` సర్టిఫికెట్ ఇచ్చారు.

ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ …త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా ఈ చిత్రాన్నిమలచడం జరిగింది. హీరోహీరోయిన్లు సూరి, నైనా తమ పాత్రలలో ఒదిగిపోయారు. సన్నివేశాలతో పాటు పాటలు హత్తుకుంటాయి ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, సింగిల్స్ కు విశేష స్పందన లభించిన సంగతి తెలిసిందే. అలాగే చిత్రం కూడా ఆధ్యంతం అలరిస్తుంది అని చిత్ర బృందం వెల్లడించింది.

ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా…సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, సమర్పణ: టి.అంజయ్య, నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్, , రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు