“బెదురులంక 2012” లేటెస్ట్ వసూళ్లు ఇవే!

bedurulanka 1
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ వలిమైలో తన నటనతో మంచి పేరు సంపాదించాడు. అయితే అతని గత కొన్ని చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇప్పుడు, అతను కొత్త దర్శకుడు క్లాక్స్ దర్శకత్వంలో బెదురులంక 2012 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు ముందుకు వచ్చాడు. ఈ చిత్రం యుగాంతం చుట్టూ నడిచే కామెడీ డ్రామా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ చిత్రం రెండు రోజుల్లో 3.83 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. అంటే రెండో రోజు ఈ సినిమా రెండు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా మూడో రోజు కూడా మంచి కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పనేని బెదురులంక 2012ని నిర్మించారు. నేహా శెట్టి కథానాయికగా నటించింది. అజయ్ ఘోష్, ఆటో రామ్ ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, సత్య, గోపరాజు రమణ, రాజ్ కుమార్, ఎల్బీ శ్రీరామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

Exit mobile version