బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్సయ్యిపోయింది!

Published on Nov 27, 2020 11:00 am IST

“అల్లుడు శీను” చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆ తర్వాత మరిన్ని సినిమాల్తో మన టాలీవుడ్ లో మంచి యాక్షన్ హీరోగా కూడా స్థిరపడ్డాడు. అయితే గత కొన్నాళ్ల నుంచి మాత్రం బెల్లంకొండ శ్రీను బాలీవుడ్ ఎంట్రీపై పలు ఆసక్తికర కథనాలే వినిపిస్తూ వచ్చాయి. ఈ హీరో మన తెలుగు సూపర్ హిట్ చిత్రం “ఛత్రపతి” రీమేక్ తో హిందీ మార్కెట్ లో కూడా అడుగు పెట్టనున్నాడని వార్తలు వినిపించాయి.

కానీ ఇప్పుడు ఫైనల్ అయ్యాయిపోయాయి. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్ అయినటువంటి దర్శక ధీరుడు రాజమౌళి అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ల కాంబోలో వచ్చిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ తో టాలీవుడ్ మాస్ దర్శకుడు వివి వినాయక్ ప్రెజెంట్ చెయ్యనుండడం ఖరారు అయ్యింది. ఈ విషయాన్నీ మేకర్సే వెల్లడి చేసారు.

ఇక అలాగే ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ భారీ ఎత్తున నిర్మించనున్నారు. అలాగే తాము ఈ కథను హిందీలోకి తీసుకెళ్లాలి అంటే బెల్లంకొండ శ్రీనివాసే కరెక్ట్ అని అనుకున్నామని తెలిపి అతనితో సినిమా చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక మన తెలుగులో శ్రీనివాస్ కు మంచి ఆరంభం ఇచ్చిన వినాయకే మళ్ళీ హిందీలో కూడా ఎంట్రీ ఇవ్వనుండడం విశేషం. మరి ఈ మాస్ కాంబో బాలీవుడ్ లో ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More