టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. గత నెలలో కావ్య రెడ్డితో జరిగిన గ్రాండ్ రోకా వేడుకతో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ యంగ్ హీరో, ఇప్పుడు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుక వీరి వైవాహిక జీవితానికి ఘనమైన నాంది పలికింది.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 5న ఒక విశాలమైన ఫామ్‌హౌస్‌లో వీరి నిశ్చితార్థ వేడుక జరగనుంది. క్లోజ్ ఫ్రెండ్స్, కొందరు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. అంగరంగ వైభవంగా, అదే సమయంలో ఎంతో ప్రైవేట్‌గా ఈ రింగ్ సెర్మనీని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇక వీరి వివాహం ఏప్రిల్ 29న పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో జరగనుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన గత చిత్రం ‘కిష్కింధపురి’ కమర్షియల్ సక్సెస్‌ను అందుకోవడంతో అటు కెరీర్‌లో ఇటు పర్సనల్ లైఫ్ రెండింటిలోనూ ఆయన ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాడు.
