ఫుల్ ఎంటర్ టైనర్ లో ‘బెల్లంకొండ’ !

Published on Feb 24, 2020 8:05 am IST

‘రాక్షసుడు’ సినిమా ద్వారా వరుస పరజాయల నుండి బయటపడ్డాడు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే గతంలో సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘కందిరీగ’ ఫార్మాట్లో ఈ సినిమా ఉంటుందట. ఆ చిత్రంలో ఉన్నట్టే హీరో పాత్ర ఫుల్ ఎనర్జీతో నడుస్తుందని.. మొత్తానికి సినిమా ఫుల్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.

అలాగే ‘కందిరీగ’లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్టే ఇందులో కూడా ఇద్దరు కథానాయికలు నభ నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నటించనున్నారు. అలాగే అందులో ఒక కీ రోల్ చేసిన సోనూ సూద్ ఈ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇక ఫైట్స్ సంగతి సరేసరి. అన్నీ హైఓల్టేజ్ పోరాటాలే. రామ్, లక్ష్మణ్ కంపోజ్ చేస్తున్న ఈ ఫైట్స్ కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెడుతున్నారు. మొత్తానికి ఈసారి కమర్షియల్ హిట్ అందుకోవాలని బెల్లంకొండ హీరో గట్టిగా ప్రయత్నిస్తున్నట్టున్నారు.

సంబంధిత సమాచారం :

X
More