
ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై జూబ్లీహిల్స్‌లోని ఆయన ఆఫీస్‌లో దాడి జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఉదయం బెల్లంకొండ సురేష్ ప్రయాణిస్తున్న కారు ఓ యువకుడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కణ్ణుంచి పారిపోయాడు.
ప్రమాదానికి గురైన యువకుడి బంధువులు ఈ విషయం తెలుసుకొని, జూబ్లిహిల్స్‌లోని బెల్లకొండ సురేష్ ఆఫీస్‌పై దాడి చేశారు. ఆఫీస్ ఫర్నీచర్‌పై మాత్రమే కాక, బెల్లంకొండ సురేష్‌పై కూడా దాడి జరిగింది. దీంతో ఆయన పోలీసులకు సమాచారమిచ్చాడు. కేసు నమోద చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు మొదలుపెట్టారు.

