భారీ రీతిలో ఉండనున్న బెల్లంకొండ బంగారుకొండ సినిమా

భారీ రీతిలో ఉండనున్న బెల్లంకొండ బంగారుకొండ సినిమా

Published on Mar 21, 2013 12:54 AM IST

Actor-Bellamkonda-Srinivas

బెల్లంకొండ సురేష్ తన తనయుడు శ్రీనివాస్ ని హీరోగా టాలీవుడ్లో ఘనంగా పరిచయం చేయడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. వి.వి వినాయక్ ఈ సినిమాకి దర్శకుడు. సమాచారం మేరకు మన బెల్లంకొండ ఈ దర్శకుడికి 10కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నాడట. ఇది మాత్రమే కాదు, అగ్ర తార సమంత నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో ఇప్పుడు తమన్నా కుడా జాయిన్ అవుతుంది. వీరిద్దరికీ స్క్రీన్ పై సమానమైన పాత్రను ఇస్తారా లేదా అన్నది ఇంకా తెలియాల్సివుంది. అయితే తమన్నాకి గత చిత్రాలకంటే ఎక్కువ పారితోషకం ఇవ్వనున్నారు.

బెల్లంకొండ సురేష్ తన కొడుకుని తెర మీద మొదటిసారిగా చూపడానికి టాలీవుడ్ టాప్ టెక్నిషియన్స్ అందరినీ వాడుకుంటున్నాడు. బ్లాక్ బస్టర్లు ఇవ్వగల డైరెక్టర్ ను సౌత్ లోనే టాప్ పోసిషన్ లో ఉన్న హీరొయిన్లను పెట్టుకున్నాడు. కొత్తగా ఈ రంగానికి వచ్చే శ్రీనివాస్ కి ఇది నిజంగా పెద్ద ప్రాజెక్ట్ యే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు