కుమారుడి సినిమాని తానే ప్రొడ్యూస్ చేస్తున్న బెల్లంకొండ

Bellamkonda-Suresh

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తన తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘అల్లుడు శీను’. ఆ తర్వాత రెండవ సినిమా బోయపాటి శ్రీను తో చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే.. దానికి సంబందించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అది జరిగిన కొద్ది రోజులకి బెల్లంకొండ సురేష్ కి రభస కూడా ఆశించిన స్థాయి లాభాలను అందించక పోవడమే కాకుండా నష్టాలను మిగిల్చింది. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ – బోయపాటి శ్రీను సినిమాకి నిర్మాత మారనున్నాడనే వార్తలు వచ్చాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ రెండవ సినిమాని కూడా తానే నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తనకున్న అన్ని ఫైనాన్సియల్ ఇబ్బందులను క్లియర్ చేసుకునే పనిలో ఉన్నాడు. అందులో చాలా వరకూ ఇప్పటికే క్లియర్ అయ్యాయి. దాంతో తనే నిర్మాతగా కొడుకు సినిమా నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ఈ సినిమా నవంబర్ మొదటి వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.

Exit mobile version