బైలంపుడి’ పూర్తి సంతృప్తినిచ్చింది – నిర్మాత బ్రహ్మానందరెడ్డి

బైలంపుడి’ పూర్తి సంతృప్తినిచ్చింది – నిర్మాత బ్రహ్మానందరెడ్డి

Published on Jul 28, 2019 10:00 PM IST

తార క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మించిన చిత్రం ‘బైలంపుడి’. హరీష్‌ వినయ్‌, త‌నిష్క తివారి జంటగా న‌టించ‌గా అనిల్‌ పిజి రాజ్‌ దర్శకత్వం వ‌హించారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో మీడియాతో మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ…‘‘పారిశ్రామికవేత్తగా ఉన్న నేను సినిమా మీద ఆసిక్తతో తొలిసారిగా నిర్మాతగా ‘బైలంపుడి’ చిత్రాన్ని నిర్మించాను. ఇక్క‌డ యుద్ధం చేయాలి…గెల‌వ‌డానికి కాదు, బ‌త‌కాడినికి అనే కాన్సెప్ట్ తో రూపొందించిన మా సినిమా ఈ శుక్ర‌వారం విడుద‌లైంది. సినిమా చూసిన వాళ్లంద‌రూ సినిమా చాలా బావుందంటున్నారు. నేను ఇందులో గురునారాయ‌ణ అనే విల‌న్ క్యార‌క్ట‌ర్ చేశాను. నిర్మాత‌గా, న‌టుడుగా నాకు ఈ సినిమా పూర్తి సంతృప్తినిచ్చింది అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ… నిన్న విడుద‌లైన మా సినిమాలో నేప‌థ్య సంగీతంతో పాటు పాట‌లు కూడా బావున్నాయంటూ కాల్స్ చేసి చెబుతున్నారు. ముఖ్యంగా పిల్ల‌ల దేవుడు పాట‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది అన్నారు. హీరో హ‌రీష్ విన‌య్ మాట్లాడుతూ…ఫ‌స్ట్ డే సంధ్య థియేట‌ర్ లో ఆడియ‌న్స్ తో క‌లిసి సినిమా చూశాం. ఆడియ‌న్స్ సినిమాను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు.

సాంగ్ కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు