అక్టోబర్ చివర్లో రవితేజ ‘బెంగాల్ టైగర్’.?

Ravi-teja
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘కిక్ 2’ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయ్యి డీసెంట్ కలెక్షన్స్ ని సాధించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి వరం రోజులు కూడా కాకుండానే రవితేజ తన తదుపరి సినిమా ‘బెంగాల్ టైగర్’ సినిమా షూటింగ్ ని చివరి దశకు తీసుకు వచ్చేసాడు. ఇప్పటికే 90% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. రవితేజ సరసన అందాల భామలు తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంపత్ నంది డైరెక్టర్.

షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ చిత్ర టీం ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం సరైన తేదీని పరిశీలిస్తున్నారు. ఎక్కువ భాగం అక్టోబర్ లో రానున్న దసరా సీజన్ లోఈ మూవీని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అక్టోబర్ లోని మొదటి మూడు వారలను కంచె, సైజ్ జీరో, శివమ్, రామ్ చరణ్ మూవీ, అఖిల్ మూవీలు బ్లాక్ చేసాయి. దాంతో ఎక్కువ భాగం అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదట్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సంపత్ నంది రవితేజ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథతో తీస్తున్న ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండనున్నాయి. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో కెకె రాధామోహన్ నిర్మిస్తున్నాడు.

Exit mobile version