బెంగాల్ టైగర్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్

bengal-tiger
అదిరిపోయే పంచ్ డైలాగ్స్ చెప్పాలన్నా, పవర్ఫుల్ మాస్ డైలాగ్స్ చెప్పడంలో మాస్ మహారాజ్ రవితేజకి మంచి పేరుంది. రవితేజ మరోసారి తన బలుపును చూపిస్తూ చేసిన మాస్ మసాలా ఫిల్మ్ ‘బెంగాల్ టైగర్’. సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం శిల్పకళావేదికలో చాలా ఘనంగా జరిగింది. ఈ వెదుఅక్లొ రిలీజ్ చేసిన ట్రైలర్ మరియు సాంగ్ టీజర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

ముఖ్యంగా బెంగాల్ టైగర్ ట్రైలర్ మీడియాలో టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది. చాలా రోజుల క్రితం నుంచి రవితేజలో కనపడని మాస్ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తోందని, కచ్చితంగా ఈ సారి సూపర్ హాట్ కొడతాడని అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో ఫేమస్ అవ్వడం కోసం ఏం చేయడానికైనా సిద్దపడే కుర్రాడి పాత్రలో రవితేజ కనిపించనున్నాడు. ఈ పాయింట్ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతోంది. రవితేజ సరసన తమన్నా, రాశీ ఖన్నాలు హీరోయిన్స్ గా కనిపించనున్న ఈ సినిమాకి భీమ్స్ మ్యూజిక్ అందించాడు. రాధా మోహన్ నిర్మించిన ఈ సినిమాని నవంబర్ 5న సినిమాని రిలీజ్ చేయనున్నారు.

బెంగాల్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version