మారుతి బ్రాండ్ ‘బెస్ట్ యాక్టర్స్’ రిలీజ్ డేట్

Best-Actors

చిన్న బడ్జెట్ సినిమాలతో పెద్ద హిట్ సినిమాలను అందించిన డైరెక్టర్ మారుతి. లాంటి మారుతి టీం వర్క్స్ సమర్పణలో సినిమా లవర్స్ సినిమా బ్యానర్ పై కుమార్ అన్నం రెడ్డి నిర్మించిన సినిమా ‘బెస్ట్ యాక్టర్స్’. అరుణ్ పవర్ దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాలో నందు, అభి, మధు, నవీద్ హీరోలుగా నటించారు. వీరికి జోడీగా మధురిమ, షామిలి, క్రతీ, కేశ కంబటిలు హీరోయిన్స్ గా నటించారు. న్ని కార్యక్రమాలు పూర్తి చ్సుసుకున్న ఈ సినిమా గత కొద్ది రోజులుగా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తోంది.

తాజాగా ఈ చిత్ర టీం ఈ సినిమాని ఆగష్టు 28న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసారు. నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన నందు, అభి, మధు, నవీద్ ల లైఫ్ లో నలుగురు అమ్మాయిలు ఎంటర్ అవ్వడం వలన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నదే ఈ సినిమా కథాంశం. సినిమా మొత్తం చాలా కామెడీగా ఉంటూ చివర్లో వచ్చే థ్రిల్స్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తాయని ఈ చిత్ర టీం అంటోంది. ఈ సినిమా రన్ టైం 120 నిమిషాలు, అందులో 90 సినిమాలు హై రేంజ్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని ఈ చిత్ర టీం తెలిపింది. జెబి ఈ సినిమాకి మ్యూజిక్ అందించాడు.