మలయాళంలో తెరకెక్కిన ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. నివిన్ పాలీ, మమితా బైజు లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం సాలిడ్ కలెక్షన్స్‌తో దుమ్ములేపింది. ఇక తాజాగా అక్టోబరు 2న జియోహాట్‌స్టార్‌లో ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది.
అయితే, బాక్సాఫీస్ దగ్గర షేక్ చేసిన ఈ సినిమాకు ఓటీటీలో మాత్రం మిక్సిడ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత సాధారణమైన కథతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అన్ని వందల కోట్లు ఎలా వసూలు చేసిందో అర్థం కావడం లేదని, ప్రచారం ఎక్కువైందని కొందరు పోస్టులు పెడుతున్నారు. అయితే, థియేటర్లలో అందించిన వినోదం, రిపీట్ వ్యాల్యూ దృష్ట్యా సినిమా విజయం సరైనదేనని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే నివిన్ పాలీ, మమితా బైజు పాత్రల మధ్య ఉన్న వయసు వ్యత్యాసంతో కూడిన ప్రేమకథపై కూడా చర్చ జరుగుతోంది. థియేటర్ రన్ సమయంలోనూ ఈ కాన్సెప్ట్ కొంతమందికి అసౌకర్యాన్ని కలిగించిందనే అభిప్రాయాలు వచ్చాయి.


