‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీకి వరుస ఆఫర్స్.. నెక్ట్స్ ఆ హీరోతోనా…?

‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీకి వరుస ఆఫర్స్.. నెక్ట్స్ ఆ హీరోతోనా…?

Published on Jun 11, 2024 12:06 PM IST

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్‌లో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలు రావడంతో, ఈ మూవీపై కూడా అదిరిపోయే బజ్ క్రియేట్ అయ్యింది. కాగా, ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ బోర్సెకు ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటికే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది. ఈ చిత్ర షూటింగ్‌లో ఆమె జాయిన్ కూడా అయ్యింది.

కాగా, ఇప్పుడు మరో సినిమాలో ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసింది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించబోయే స్ట్రెయిట్ తెలుగు మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాను రవి అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించనుండగా, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు