ప్రస్తుతం టాలీవుడ్లో రిలీజ్‌కు రెడీగా ఉన్న మల్టీస్టారర్ చిత్రం ‘భైరవం’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడటంతో ఈ చిత్ర ఫైనల్ కాపీని చిత్ర యూనిట్ వీక్షించింది
ఈ సినిమా కంటెంట్‌పై వారు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే, ఈ చిత్ర ఫైనల్ కాపీ చూసి వారు సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని తేల్చి చెప్పారు. అంతేగాక, వారు ఏకంగా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి వారు బాణాసంచా కాల్చారు. ఇలా ఓ సినిమా ప్రీ-రిలీజ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించగా అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు.
