సెన్సార్ పూర్తి చేసుకున్న ‘భజే వాయు వేగం’ !

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘భజే వాయు వేగం’ !

Published on May 29, 2024 10:30 PM IST

యంగ్ హీరో కార్తికేయ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “భజే వాయు వేగం”. డెబ్యూ దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందింది. మరి ఈ భజే వాయు వేగం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ ప్రభావం చూపిస్తోందో చూడాలి.

కాగా ఈ చిత్రంలో రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. UV క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం మరియు నేపథ్య సంగీతం రాధన్ మరియు కపిల్ కుమార్ అందించారు. మరి మే 31న ఈ సినిమాకి ఏ స్థాయి ఆదరణ దక్కుతుందో చూద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు