కార్తికేయ‌ : ‘భ‌జే వాయు వేగం’ నాకు ప‌ర్ఫెక్ట్ సినిమా

కార్తికేయ‌ : ‘భ‌జే వాయు వేగం’ నాకు ప‌ర్ఫెక్ట్ సినిమా

Published on May 29, 2024 8:31 PM IST

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కార్తికేయ గుమ్మ‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం ‘భ‌జే వాయు వేగం’ ఈనెల 31న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ రెడ్డి డైరెక్ట్ చేయ‌గా, పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌ వివ‌రాల‌ను హీరో కార్తికేయ మీడియాతో పంచుకున్నాడు.

భ‌జే వాయు వేగం ప్ర‌యాణం ఎలా మొద‌లైంది..?
లాక్ డౌన్ స‌మ‌యంలో ప్ర‌శాంత్ రెడ్డి ఈ చిత్ర క‌థ వినిపించాడు. అత‌డు క‌థ చెబుతుండ‌గానే నేను అందులో లీన‌మ‌య్యాను. దీంతో ఈ సినిమా ఖ‌చ్చితంగా చేయాల‌ని నిర్ణ‌యించుకుని, సినిమాను మొద‌లుపెట్టాం. అయితే, సినిమా క‌థ‌, ప్ర‌శాంత్ రెడ్డిల‌పై న‌మ్మ‌కం పెరిగేకొద్ది ఈ సినిమాను త్వ‌ర‌గా కాకుండా సినిమాకు మరింత స‌మ‌యం కేటాయించి, మ‌రింత బెట‌ర్ గా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను.

భ‌జే వాయు వేగం మీకు ఎందుకు న‌చ్చింది..?
ఈ సినిమా ఇప్పుడున్న నా ఇమేజ్ కి ప‌ర్ఫెక్ట్ గా సెట్ అవుతుంద‌ని చెప్పాలి. హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ లాంటి అంశాలు పుష్కలంగా ఉండ‌టంతో ఈ సినిమా క‌థ నాకు బాగా న‌చ్చింది.

యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో వ‌ర్క్ చేయ‌డం ఎలా అనిపించింది?
యూవీ క్రియేష‌న్స్ వంటి పెద్ద బ్యాన‌ర్ లో వ‌ర్క్ చేయ‌డం చాలా సంతోషానిచ్చింది. ఇంత‌టి పెద్ద బ్యాన‌ర్ లో సినిమా చేస్తే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్, రిలీజ్ వంటి విష‌యాల్లో ఎలాంటి జాప్యం జ‌ర‌గ‌దు. మా సినిమాకు నిర్మాత‌ల నుంచి పూర్తి స‌పోర్ట్ ల‌భించింది.

ఇందులో హీరోయిన్ పాత్ర ఎలా ఉండ‌బోతుంది..?
ఈ సినిమాలో ఐశ్వ‌ర్య మీన‌న్ పాత్ర చాలా సింపుల్ గా ఉండ‌నుంది. ఆమెది చాలా ఇంపార్టెంట్ రోల్. క‌థ‌ను ముందుకు తీసుకెళ్ల‌డంలో హీరోయిన్ పాత్ర చాలా కీల‌కం.

రాహుల్ తో స్క్రీన్ షేరింగ్ పై మీ కామెంట్స్..?
హ్యాపీ డేస్ ఫేం రాహుల్ టైస‌న్ గా అంద‌రికీ ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ సినిమాలో అత‌డికి మంచి రోల్ ద‌క్కింది. ఇద్ద‌రం క‌లిసి షూటింగ్ లో బాగా ఎంజాయ్ చేశాం. అత‌డితో మంచి స్నేహం ఏర్ప‌డింది.

హీరోగా చేస్తున్న స‌మ‌యంలో విల‌న్ పాత్ర‌లు ఎందుకు చేశారు?
ఓ వైపు హీరోగా చేస్తూనే, విల‌న్ పాత్ర‌లు చేయ‌డాన్ని నేను స‌మ‌ర్ధిస్తాను. ఓ న‌టుడికి ఎలాంటి పాత్ర‌నైనా చేసే సత్తా ఉండాలి. నేను హీరోగా చేస్తున్న స‌మ‌యంలో మంచి స్కోప్ ఉన్న విల‌న్ పాత్ర‌లు ద‌క్కాయి. అందుకే గ్యాంగ్ లీడ‌ర్, వాలిమై చిత్రాల్లో విల‌న్ గా న‌టించాను. అయితే, ఆ సినిమాల త‌రువాత నేను స్టైలిష్ మేకోవర్ లో సినిమాలు చేయడం ప్రారంభించాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు