కార్తికేయ “భజే వాయు వేగం” ను డిస్ట్రిబ్యూట్ చేయనున్న ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్!

కార్తికేయ “భజే వాయు వేగం” ను డిస్ట్రిబ్యూట్ చేయనున్న ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్!

Published on May 22, 2024 9:00 PM IST

యువి క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ పతాకంపై యంగ్ హీరో కార్తికేయ కథానాయకుడి గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం భజే వాయు వేగం. ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుండగా, హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ని తెరకెక్కించారు. అజయ్ కుమార్ రాజు. పి. సహ నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత మరియు పంపిణీదారుడు అయిన ధీరజ్ మొగిలినేని తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ ద్వారా భారతదేశం అంతటా విడుదల చేస్తున్నారు. బేబీ, గుంటూరు కారం, హనుమాన్, గామీ, ఓం భీమ్ బుష్ మరియు టిల్లు స్క్వేర్ వంటి చిత్రాలతో ధీరజ్ మొగిలినేని డిస్ట్రిబ్యూటర్‌గా విజయవంతమైన ప్రయాణాన్ని సాగించారు. కార్తికేయ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విశ్వక్ సేన్ యొక్క గ్యాంగ్స్ ఆఫ్ గోదావర్, కాజల్ యొక్క సత్యభామ, ఆనంద్ దేవరకొండ యొక్క గం గం గణేశా మరియు చాందిని చౌదరి యొక్క మ్యూజిక్ షాప్ మూర్తితో పోటీపడుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు