మంచు హీరో భారీ రిస్క్ చేస్తున్నట్లే..!

మంచు హీరో భారీ రిస్క్ చేస్తున్నట్లే..!

Published on Apr 18, 2020 10:25 AM IST

మంచు హీరోలు విష్ణు, మనోజ్ పాన్ ఇండియా చిత్రాలపై పడ్డారు. మంచు విష్ణు హీరోగా దర్శకుడు జెఫ్రిన్ తెరకెక్కిస్తున్న మోసగాళ్లు చిత్రం పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మనోజ్ అహం బ్రహ్మాస్మి అనే ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

కాగా మంచు విష్ణు కొన్నిరోజుల క్రితం భక్త కన్నప్ప సినిమా తీయనున్నట్లు ప్రకటించారు. పౌరాణిక గాథగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఐతే ఈ సినిమా బడ్జెట్ 90కోట్ల వరకు ఉంటుందని మంచు విష్ణు చెప్పడం జరిగింది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భక్త కన్నప్ప మూవీ కోసం అంత బడ్జెట్ కేటాయించడం అంటే రిస్క్ అనే చెప్పాలి. మంచు విష్ణు మార్కెట్ అంచనా వేసి చూస్తే భక్త కన్నప్ప చిత్రంతో ఆయన పెద్ద సాహసం చేస్తున్నట్లే లెక్క.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు