
‘అష్టా చమ్మా’, ‘అలా మొదలైంది’ సినిమాలతో మన పక్కింటి కుర్రాడిలా తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న యంగ్ హీరో నాని. ఈ ఏడాది ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండా పై కపిరాజు’ సినిమాలు అందించిన కమర్షియల్ గా సక్సెస్ తో ఊపందుకున్న నాని చేస్తున్న నెక్స్ట్ మూవీ ‘భలే భలే మగాడివోయ్’. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇంకా కేవలం రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. లో బడ్జెట్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న మారుతి ఈ సినిమాకి డైరెక్టర్.
మాకు అందిన సమాచారం ప్రకారం జూలై మూడో వారం కల్లా ఈ రెండు పాటల షూటింగ్ ని ఫినిష్ చేయనున్నారు. అలాగే సినిమాని ఆగష్టు మిడిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. అలాగే నాని కూడా తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ వర్క్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో నాని 8 పేజీల డైలాగ్ ని సింగిల్ టేక్ లో చేసిన సీన్ సినిమాకి హైలైట్ కానుంది. నాని సరసన ‘అందాల రాక్షసి’ అనిపించుకున్న లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తోంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ – యువి క్రియేషన్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా పూర్తి కాగానే నాని హను రాఘవాపూడి డైరెక్షన్ లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో చేయనున్న సినిమాకి సంబందించిన షూటింగ్ ని కూడా మొదలు పెట్టాడు.