
‘మోసగాళ్ళకు మోసగాడు’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ లాంటి డీసెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో సుధీర్ బాబు. ఈ రెండు సినిమాల తర్వాత సుధీర్ బాబు తన నెక్స్ట్ సినిమా ‘భలే మంచి రోజు’ షూటింగ్ ని పూర్తి చేసాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నేపధ్యంలో వస్తున్నా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. దాంతో ఈ చిత్ర టీం ఆడియోని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మాకు అందింన సమాచారం ప్రకారం భలే మంచి రోజు ఆడియోని అక్టోబర్ చివరి వారలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. త్వరలోనే పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు.
శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో చండీఘర్ బ్యూటీ వమిక గబ్బి హీరోయిన్ గా పరిచయం కానుంది. సినిమా చాలా బాగా వచ్చిందని ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉన్నారు. భలే మంచి రోజు సినిమాని సుధీర్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన శశి – వంశీ కలిసి నిర్మిస్తున్నారు. విశ్వరూపం 2, ఉత్తమ విలన్ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన శాందత్ కెమెరామెన్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి సన్నీ ఎంఆర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.