
నవదీప్, నవీన్ చంద్ర కలసి నటించిన మల్టీస్టారర్ సినిమా ‘భం బోలేనాథ్’. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రదీప్, ప్రవీణ్ లు కీలక పాత్రలో నటించారు. పూజ హీరోయిన్. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి.
ఒక లక్ష్యం కోసం పోరాటం చేసే ముగ్గురు వ్యక్తుల జీవితాల్లో ఎంటువంటి అనూహ్య సంఘటనలు జరిగాయి. వారికి సంబంధం ఏంటి..? అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. రెగ్యులర్ తెలుగు సినిమాలకు భిన్నంగా ఉందని ప్రేక్షకుల నుండి మన్ననలు అందుకుంది. ఇటివల ఈ తరహా సినిమాలు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది.
గతంలో ‘కార్తికేయ’ వంటి విజయవంతమైన సినిమాను నిర్మించిన శిరువూరి రాజేష్ వర్మ.. మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా కార్తీక్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. సాయి కార్తీక్ సంగీత దర్శకుడు.