
యువ హీరోలు నవదీప్, నవీన్ చంద్ర కలసి నటించిన సినిమా ‘భం భోలేనాథ్’. ‘కార్తికేయ’ వంటి విజయవంతమైన సినిమాను ప్రేక్షకులకు అందించిన శిరువూరి రాజేష్ వర్మ ఈ క్రైమ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కార్తికేయ’ సినిమాకి రైటింగ్ మరియు స్క్రీన్ ప్లే డిపార్ట్ మెంట్ లో పని చేసిన కార్తీక్ వర్మ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని ముందుగా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఈ వీక్ లో స్టార్ హీరో ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ సినిమా రిలీజ్ కూడా ఉండడం వలన ఈ చిత్ర టీం ఒక వారం ఈ సినిమాని వెనక్కి వేసారు. అనగా ఈ సినిమాని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని ఈ చిత్ర హీరో నవదీప్ తెలియజేశాడు. ఆర్.సి.సి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించారు. భరణి కె ధరణి సినిమాటోగ్రాఫర్. ఈ మధ్య కాలంలో కొత్త పాయింట్స్ తో దర్శకులుగా పరిచయం అయ్యి హిట్ అందుకుంటున్న వారి జాబితాలో కార్తీక్ వర్మ కూడా చేరుతాడా లేదా అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..