‘భం భోలేనాథ్’ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన.

‘భం భోలేనాథ్’ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన.

Published on Nov 6, 2014 1:26 AM IST

Bham-Bolenath
యువ హీరోలు నవదీప్, నవీన్ చంద్ర కలసి నటించిన సినిమా ‘భం భోలేనాథ్’. ‘కార్తికేయ’ వంటి విజయవంతమైన సినిమాను ప్రేక్షకులకు అందించిన శిరువూరి రాజేష్ వర్మ ఈ కామెడీ థ్రిల్లర్ సినిమాను నిర్మించారు. భుదవారం సాయంత్రం ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. తుపాకీతో నవీన్ చంద్ర, చేతిలో ఒక బ్యాగ్ తో నవదీప్ ఈ పోస్టర్ లో దర్శనం ఇచ్చారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఇంటర్నెట్ లో విశేష స్పందన లభించింది. క్రైమ్ నేపధ్యంలో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్ అని అర్ధమవుతుంది. ఈ సినిమా ద్వారా కార్తీక్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ యువ దర్శకుడు ‘కార్తికేయ’ సినిమాకి రేటింగ్ మరియు స్క్రీన్ ప్లే డిపార్ట్ మెంట్ లో పని చేశాడు.

ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదల నెలాఖరులో ఉంటుందని సమాచారం. ఆర్.సి.సి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించారు. భరణి కె ధరణి సినిమాటోగ్రాఫర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు