సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న భామాకలాపం 2!

సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న భామాకలాపం 2!

Published on Feb 21, 2024 9:45 PM IST

నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి ఇటీవల నటించిన మూవీ భామాకలాపం 2 కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది ప్రేక్షకుల. ఆహా వీడియో లో విడుదలైన ఈ చిత్రంలో సీరత్ కపూర్ మరియు శరణ్య ప్రదీప్ లు కీలక పాత్రలు పోషించారు. ప్రియమణి తన నటనకు విమర్శకుల నుండి విశేష ప్రశంసలు అందుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల నుండి విజయవంతమైన ఆదరణ పొందిన తరువాత, ఈ డైనమిక్ సీక్వెల్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను మరియు ఒక మిలియన్ ప్రత్యేక వీక్షకులను సంపాదించింది. భామాకలాపం 2 అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఒరిజినల్ చిత్రంగా నిలిచింది. రానున్న రోజుల్లో కూడా ఇదే దూకుడు కొనసాగుతుందని భావిస్తున్నారు. అతి త్వరలో భామాకలాపం 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ మరియు ఇతరులు కూడా కీలక పాత్రల్లో నటించారు. దీనిని డ్రీమ్ ఫార్మర్స్ మరియు ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు మరియు సుధీర్ ఈదర నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు