మలయాళంలో విడుదలకానున్న ‘భరత్ అనే నేను’ !
Published on May 18, 2018 8:50 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం ఆయన కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తెలుగునాట పలు ప్రాంతాల్లో విజయవంతంగా నడుస్తోందీ చిత్రం. ఇంతలా సక్సెస్ సాధించిన ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోకి కూడ అనువదిస్తున్నారు నిర్మాతలు.

ఇప్పటికే ‘భరత్ ఎనుము నాన్’ పేరుతో తమిళంలోకి డబ్ అయిన ఈ సినిమా మే 25న తమిళనాట విడుదలవుతుండగా ‘భరత్ ఎన్న అంజాన్’ గా మలయాళంలోకి కూడ అనువదింపబడి అదే రోజున కేరళలో రిలీజవుతోంది. ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ తమీన్స్ ఈ చిత్రాన్ని మలయాళంలో విడుదలచేయనుంది.

దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఉన్న మహేష్ ఫ్యాన్ బేస్ మరింత పెరిగి ఆయన మార్కెట్ స్థాయి కూడ ముందుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook