‘భారతీయుడు – 2’ నైజాం రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

‘భారతీయుడు – 2’ నైజాం రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

Published on Feb 21, 2024 8:34 PM IST

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి అతి పెద్ద విజయం అందుకున్న భారతీయుడు కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, ఎస్ జె సూర్య, సిద్దార్ధ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో రూపొందుతున్న ఈ మూవీ యొక్క నైజాం రైట్స్ ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి (సురేష్ ప్రొడక్షన్స్ & ఏషియన్ సినిమాస్) వారు తాజాగా భారీ ధరకు దక్కించుకున్నారు. తప్పకుండా ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుని ఆడియన్స్ ని కమల్ ఫ్యాన్స్ ని అలరిస్తుందని అంటున్నారు మేకర్స్. త్వరలో ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ తో పాటు ఇతర అప్ డేట్స్ అన్ని ఒక్కొక్కటిగా రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు