మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫంట్ పిక్చర్స్ బ్యానర్లో తాజాగా ‘రాకాస’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఈ సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తుండగా నయన్ సారిక హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రానుంది.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలో నిహారిక ఓ ఇంటర్వ్యూలో తన బ్యానర్ నుంచి రానున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘బరి’కి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. తన సోదరుడు వరుణ్ తేజ్ హీరోగా యుదు వంశీ డైరెక్షన్లో పూర్తి స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ‘బరి’ చిత్రాన్ని ఇటీవల అఫీషియల్‌గా స్టార్ట్ చేశారు. ఈ సినిమా కోసం ఏకంగా రూ.60 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు నిహారిక తెలిపింది.
తన బ్యానర్ నుంచి రాబోతున్న హైయెస్ట్ బడ్జెట్ మూవీ ‘బరి’ అని ఆమె పేర్కొంది. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమాలో తెలుగు హీరోయిన్ నటిస్తుందని ఆమె తెలిపింది. అయితే, ఆ హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఆమె రివీల్ చేయలేదు. మొత్తానికి ‘బరి’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో నెక్స్ట్ లెవెల్ టార్గెట్‌ను ఫిక్స్ చేసుకుంటుంది ఈ మెగా డాటర్.
