‘భీమా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్

‘భీమా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్

Published on Feb 23, 2024 6:03 PM IST

గోపీచంద్ హీరోగా ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా యువ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మాస్ మూవీ భీమా. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్, టీజర్ తో అందరినీ ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచిన భీమా ట్రైలర్ ని రేపు రిలీజ్ చేయనున్నట్లు నేడు ఉదయం మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ ట్రైలర్ ని రేపు హైదరాబాద్ లోని ఏఏఏ సినిమాస్ స్క్రీన్ 1 లో మధ్యాహ్నం 3 గం. ల నుండి జరుగనున్న ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేయనున్నట్లు వారు కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసారు. కాగా భీమా మూవీ మార్చి 8న ఆడియన్స్ ముందుకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు