దీన పరిస్థితిలో కిన్నెర మొగిలయ్య..

దీన పరిస్థితిలో కిన్నెర మొగిలయ్య..

Published on May 3, 2024 2:30 PM IST

సినిమా ద్వారా చాలా మందికి తెలియని అంశాలు భావి తరాలకి తెలుస్తాయి. మన దేశంలో కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఎన్నో పురాతన కళలు, జానపద గేయాలు తప్పకుండ మన తరువాతి తరాలకి తెలియజేసే భాద్యత అందరి మీద ఎంతో ఉంది. అలా అంతరించిపోతున్న కిన్నెర కళని ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన “భీమ్లా నాయక్” అనే సినిమాతో అందరికీ తెలిసేలా చేసాడు.

దీనితో ఆ కళని ఇప్పటికీ పదిలంగా కొనసాగిస్తూ వస్తున్నా ప్రముఖ కిన్నెర విద్వాంసులు దర్శనం మొగిలయ్య ఆ సమయంలో మంచి ఫేమ్ ని అందుకున్నారు తద్వారా పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. కానీ ఇప్పుడు వారి పరిస్థితి దీనంగా మారడం బాధాకరం. తాజాగా వచ్చిన కథనాలు ప్రకారం కిన్నెర ముమొగిలయ్య తన జీవనోపాధిగా ప్రస్తుతం రోజువారీ కూలీగా పని చేస్తున్నారట.

అయితే తన 9 మంది సంతానంలో ఓ కొడుకుకి కేవలం మెడిసిన్స్ కోసం నెలకి 7 వేల రూపాయలు కావాల్సి ఉంటుంది అని అందుకే తాను ఈ పని చేస్తున్నట్టుగా తెలిపారట. అయితే 73 ఏళ్ల వయసులో ఆయన ఈ రకంగా కష్టపడడం అనేది విని ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు అని మొగిలయ్య గారి విషయాన్ని తాను పర్శనల్ గా తీసుకొని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీనితో ఈ అంశం వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు