యూఎస్ లో హాఫ్ మిలియన్ కి చేరువైన భీష్మ

యూఎస్ లో హాఫ్ మిలియన్ కి చేరువైన భీష్మ

Published on Feb 23, 2020 12:03 PM IST

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భీష్మ మూవీ మంచి వసూళ్లను రాబడుతుంది. ముఖ్యంగా యూఎస్ లో ఈ చిత్ర వసూళ్లు హాఫ్ మిలియన్ కి చేరువ అయ్యాయి. భీష్మ ప్రీమియర్స్ ద్వారా143 లొకేషన్స్ నుండి డీసెంట్ $94,744 డాలర్ల వసూళ్లు అందుకుంది. ఐతే పాజిటివ్ టాక్ రీత్యా శుక్రవారం వసూళ్లు బాగా పెరగడంతో 144 లొకేషన్స్ నుండి $151,697 డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఇక శనివారం రాత్రి 10:15 నిమిషాల వరకు 136 లొకేషన్స్ నుండి $234,564 డాలర్ల వసూళ్లు దక్కాయి.

మొత్తంగా $481,005 లక్షల గ్రాస్ వసూళ్లకు భీష్మ చేరుకుంది. అనగా శనివారం ముగిసేనాటికి భీష్మ హాఫ్ మిలియన్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.దర్శకుడు వెంకీ కుడుముల యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా, మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు