‘భీష్మ’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

‘భీష్మ’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Jan 10, 2020 4:46 PM IST

bheesama

నితిన్ హీరోగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రానున్న ‘భీష్మ’ చిత్రం నుండి టీజర్ రానుంది. జనవరి 12న ఉదయం 10 గంటలకు ఈ సినిమా టీజర్ విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉంది. నితిన్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక. ‘ఛలో’ మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట.

ఈ చిత్రంలో ఒక కీ రోల్ కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్నారు. కాగా సినిమాలో హెబ్బా పటేల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. మరి హెబ్బాకి ఈ చిత్రంతోనైనా ఆమె ఆశించిన బ్రేక్ ఆమెకు దక్కుతుందేమో చూడాలి. కాగా నితిన్ కూడా భీష్మ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు