‘భీమా’ : ఆ రెండు బ్లాక్స్ మెయిన్ హైలైట్ అట ?

‘భీమా’ : ఆ రెండు బ్లాక్స్ మెయిన్ హైలైట్ అట ?

Published on Mar 4, 2024 7:25 PM IST

యక్షన్ హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ భీమా మార్చి 8న శివరాత్రి సందర్భంగా గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఓవైపు మూవీ టీజర్, సొంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకోగా ఇంకోవైపు టీమ్ ప్రమోషన్స్ ని గ్రాండ్ గా నిర్వహిస్తోంది. ఏ హర్ష తెరకెక్కించిన ఈమూవీలో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై దీనిని కేకే రాధామోహన్ నిర్మించారు.

ఇక ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ బజ్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీలో వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ తో పాటు క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయట. ముఖ్యంగా ఆ బ్లాక్స్ తో పాటు ఆ సీన్స్ లో హీరో గోపీచంద్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ మరింత హైలైట్ గా నిలవనున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ మూవీకి కెజిఎఫ్ సినిమాల ఫేమ్ రవి బస్రూర్ అందించిన సాంగ్స్ కూడా మంచి ఆదరణ అందుకున్నాయి. మరి రిలీజ్ అనంతరం భీమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు