లేటెస్ట్…కల్కి లో అశ్వథ్థామ గా అమితాబ్ బచ్చన్!

లేటెస్ట్…కల్కి లో అశ్వథ్థామ గా అమితాబ్ బచ్చన్!

Published on Apr 21, 2024 8:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ కెరీర్ లో దూసుకు పోతున్నారు. గతేడాది సలార్ (Salaar) చిత్రం తో ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న ఈ హీరో, తదుపరి కల్కి 2898AD (Kalki 2898AD) చిత్రం లో కనిపించనున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ వరల్డ్ మూవీ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

నేడు బిగ్ బి రోల్ కి సంబందించిన చిన్న వీడియో ఒకటి రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్ అశ్వథ్థామ గా కనిపించనున్నారు. ఈ న్యూస్ ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఈ చిత్రం రిలీజ్ డేట్ పై ఈ అప్డేట్ తో క్లారిటీ వస్తుంది అని అంతా భావించారు. మేకర్స్ ఈ చిత్రం రిలీజ్ డేట్ పై ఎలాంటి అప్డేట్ ను ఇవ్వలేదు. ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు