బుల్లి తెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ కొద్దీ సేపటి క్రితం ప్రారంభం అయింది. నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ ఎవరో అని ప్రేక్షకులంతా ఆసక్తిగా గమనించారు .ఈ సారి పెద్దగా పరిచియంలేని సెలబ్రిటీస్ పాల్గొంటున్నారు .మొత్తం ఈ షో లో 16 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం .
ప్రముఖ తెలుగు గాయని గీతా మాధురి ,న్యూస్ యాంకర్ దీప్తి , అనేక తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలో నటించిన అమిత్ తివారి , హీరో తనీష్ , యాంకర్ శ్యామల , తెలుగు నటి తేజస్వి మడివాడ ,నటుడు సామ్రాట్ ,కిర్రాక్ పార్టీ చిత్రంలో నటించిన దీప్తి సునైనా,ప్రముఖ హ్యూమనిస్ట్ బాబు గోగినేని , ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా ఫేమస్ అయిన రోల్ రైడ , తెలుగు చిత్రాల్లో ఫ్రెండ్ పాత్రలో నటించిన కిరీటీ దామరాజు అలాగే బుల్లితెర నటుడు కౌశల్ , భాను శ్రీ వీరితో పాటు సామాన్యులు నూతన నాయుడు , సంజన , గణేష్ లు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు .
ఈ జాబితాలో గీతామాధురి , దీప్తి , శ్యామల , తేజస్వి , బాబు గోగినేని తప్ప మిగితా వారు అంతగా పరచియం లేకపోవడం ఈ సెకండ్ సీజన్ ఫై ఎలాంటి ప్రభావం చూపనుందో రాబోవు రోజుల్లో తెలుస్తుంది .


