‘బిగ్ బాస్ 2’ నేడే ప్రారంభం !

‘బిగ్ బాస్ 2’ నేడే ప్రారంభం !

Published on Jun 10, 2018 2:57 PM IST

Bigg Boss2

ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 1’ బుల్లి స్క్రీన్ ను ఎంతటి ఉరూతలు ఊగించిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎన్టీఆర్ ప్లేస్ లోకి నాని వచ్చారు. ‘బిగ్ బాస్ 2’ ‘ఏదైనా జరగొచ్చు’ అనే క్యాప్షన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ షో నేడే ప్రారంభం కానుంది. రాత్రి 9 గంటలకు ‘స్టార్ మా’లో ‘షో’ ప్రసారం అవ్వనుంది. కాగా శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటల నుండి, సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రం రాత్రి 9 గంటల 30 నిముషాలకు ‘బిగ్ బాస్ 2’ మొదలవుతుంది. ప్రేక్షకుల్లో ఈ ‘షో’ పట్ల ఆసక్తిని పెంచటానికి ‘772 999 8825 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నాని మీతో మాట్లాడే అవకాశం పొందండి’ అంటూ నిర్వాహకులు ఈ ‘షో’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

మొత్తం పదాహారు మంది సెలెబ్రెటీస్ వంద రోజులు పాటు ఈ ‘బిగ్ బాస్ 2 షో’లో పాల్గొనడానికి వస్తారు. ఆ పదహారు మంది సెలెబ్రెటీస్ ఎవరనేది తెలుసుకోవటానికి ప్రేక్షకులు ఎంతో ఇంట్రస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘బిగ్ బాస్ షో’కు వచ్చేది వీరే అంటూ చాలామంది పేర్లు తెర పైకి వచ్చాయి. అయితే ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే ‘షో’ ఆ పదహారు మంది ఎవ్వరనేది తెలిసిపోతుంది.

తాజా వార్తలు