బిగ్ బ్రేకింగ్ : పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసిన ఇళయదళపతి విజయ్

బిగ్ బ్రేకింగ్ : పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసిన ఇళయదళపతి విజయ్

Published on Feb 2, 2024 3:48 PM IST


కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఈ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే విజయ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అంటూ ఇటీవల కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో నేడు సడన్ గా తన పొలిటికల్ పార్టీని ఆయన అనౌన్స్ చేసారు.

కాగా ఆయన పార్టీ పేరు ‘తమిళగ వెట్రి కళగం’. కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా స్వయంగా విజయ్ తన పార్టీ పేరుని అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఆయనకు బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నారు. ఇక తన సినీ కెరీర్ ని ప్రస్తుతం చేస్తున్న 69వ మూవీతో ఫుల్ స్టాప్ పెట్టి అక్కడి నుండి పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా పాల్గొని ఇకపై తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేయనున్నట్లు విజయ్ తన సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపారు. మొత్తంగా ప్రస్తుతం ఈ న్యూస్ ఇండియా వైడ్ గా మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు