నాన్నకి అమితాబ్ అంటే చాలా ఇష్టం – నాగార్జున

నాన్నకి అమితాబ్ అంటే చాలా ఇష్టం – నాగార్జున

Published on May 12, 2014 2:19 PM IST

amitabh-bachchan
అక్కినేని ఫ్యామిలీ హీరోలు చేసిన ‘మనం’ సినిమాలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చిన్ ఓ అతిధి పాత్రలో కనిపించనున్న సంగతి మనకు తెలిసిందే. ఎఎన్ఆర్ కోసం బిగ్ బి మనం లో చేసిన అతిధి పాత్ర సంథింగ్ స్పెషల్ అని నాగార్జున చెప్పాడు.

అలాగే అమితాబ్ గురించి నాగార్జున మాట్లాడుతూ ‘ నాన్నకి అమితాబ్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసినప్పుడల్లా అరే ఎంత బాగా చేసాడురా.. చూడటానికి చక్కగా ఉందికదరా అనే వాడు. అమితాబ్ సినిమాలు ఒక్కటి కూడా మిస్ అయ్యేవాడు కాదు. అలాగే వీరిద్దరికీ మంచి అనుబంధం ఉంది. అందుకే నెఉ సినిమా అకోసం అడగగానే ఒప్పుకున్నారు. నాన్న గారి చివరి సినిమాలో అమితాబ్ కనిపించడం స్పెషల్ అట్రాక్షన్ అని’ అన్నాడు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 23 న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. నాగార్జున, నాగ చైతన్య, సమంత, శ్రియ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి విక్రమ్ కుమార్ డైరెక్టర్.

తాజా వార్తలు