‘లింగ’తో బడా సినిమాల సందడి

‘లింగ’తో బడా సినిమాల సందడి

Published on Dec 1, 2014 12:17 PM IST

lingaa-sencor
గత రెండు నెలల నుండి బాక్సాఫీస్ వద్ద లో, మీడియం బడ్జెట్ సినిమాలు సందడి చేస్తున్నాయి. దసరా కానుకగా విడుదలైన ‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత భారి బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ రెండు నెలలో ప్రతివారం నాలుగైదు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. గత శుక్రవారం ఏకంగా 9 సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వరదలా పోటెత్తిన ఈ లో బడ్జెట్ సినిమాలకు ఆనకట్ట కడుతున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్.

రజినీకాంత్ నటించిన ‘లింగ’ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ ఏడాది చివరిలో విడుదల కానున్న బడా సినిమా ఇదే. ‘లింగ’ సినిమాపై అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులలో భారి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో బడా హీరోల సందడి మొదలు కానుంది. వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, విక్రమ్ (ఐ సినిమా) వంటి స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి సన్నద్ధం అవుతున్నారు.

అయితే పవన్, ఎన్టీఆర్ సినిమాలు వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. 2014 సంవత్సరానికి ముగింపు పలికేది మాత్రం ఓ కొత్త హీరో కావడం గమనార్హం. మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అవుతున్న వరుణ్ తేజ్ తన ‘ముకుంద’ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నాడు. నితిన్ – కరుణాకరణ్ ల ‘చిన్నదాన నీ కోసం’ కూడా డిసెంబర్ చివరిలో విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు