బిగ్ ట్విస్ట్: ‘అఖండ’తో ఉన్న టాప్ హీరో సినిమా రిలీజ్ కి బ్రేక్!?

vaa vathiyar

గత వారమే సౌత్ సినిమా దగ్గరే కాకుండా ఇండియన్ సినిమా దగ్గరే బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరైన నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అవైటెడ్ చిత్రం అఖండ 2 చివరి నిమిషంలో వాయిదా పాడడం షాకింగ్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక నెక్స్ట్ ఈ సినిమాని ఆ తర్వాత వారానికి అంతే డిసెంబర్ 12కి మార్చారు.

ఇక ఇదిలా ఉండగా అఖండ 2 తోనే కోలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకరైన కార్తీ నటించిన అవైటెడ్ సినిమా ‘అన్నగారు వస్తారు’ కూడా ఒకే డేట్ లో షెడ్యూల్ అయ్యి ఉంది. దీనితో పోటీ ఖాయం అనుకున్నారు కానీ బిగ్ ట్విస్ట్ ఇపుడు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.

వా వాతియార్ (అన్నగారు వస్తారు) నిర్మాతలు (స్టూడియో గ్రీన్ సంస్థ) కూడా పెండింగ్ ఉన్న బకాయిలు చెల్లించాల్సి ఉందని అందుకే ఈ సినిమా కూడా చివరి నిమిషంలో వాయిదా పడినట్టు కొత్త రూమర్స్ ఇపుడు బయటకి వచ్చాయి. దీనితో అభిమానులు ఓ అఫీషియల్ క్లారిటీ దీనిపై కోరుకుంటున్నారు.

Exit mobile version