“రాయన్” నుండి బిగ్ అప్డేట్ అందించిన ధనుష్!

“రాయన్” నుండి బిగ్ అప్డేట్ అందించిన ధనుష్!

Published on May 28, 2024 10:28 PM IST


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో రాయన్ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం అతనికి నటుడిగా 50 వ చిత్రం కాగా, దర్శకుడు గా రెండవ చిత్రం. జూన్ 13, 2024న థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ అయిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నుండి మరో బిగ్ అప్డేట్ ను అందించారు ధనుష్. ఈ చిత్రం కి సంబందించిన పూర్తి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పూర్తి అయ్యింది అని సోషల్ మీడియాలో వెల్లడించారు. రెహమాన్ సినిమాకి బిజీఎం అందిస్తున్న ఫోటోను షేర్ చేశారు. ఇది ఆడియన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది.

ధనుష్ ఈ చిత్రం లో పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. SJ సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి మరియు వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ను సన్ పిక్చర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు