శ్రీముఖి పై నాగ్ సీరియస్ ?

శ్రీముఖి పై నాగ్ సీరియస్ ?

Published on Sep 14, 2019 9:26 PM IST

బిగ్‌బాస్‌ ఈ వారంలో ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్‌ లో ఇంటి సభ్యులు ఆడిన విధానం ఆ పై టాస్క్‌ను నిందించడం.. బిగ్‌బాస్‌ ను ఎదిరించడం.. లాంటివి చాలానే జరిగాయి. ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ బాస్ లో శ్రీముఖికి లేడి గ్యాంగ్ లీడర్ అనే పేరు ఉంది. హౌస్ లో శ్రీముఖి డామినేషన్ ఎక్కువగానే ఉంటుంది. టాస్క్ లో కావచ్చు, హౌస్ లో ఏమైనా నిర్ణయం తీసుకునే విషయంలో కావచ్చు ప్రతి ఒక్క హౌస్ మేట్ తన మాటే వినాలని శ్రీముఖి అనుకుంటుంది. అయితే ఇలాంటి పరిణామాల పై నాగార్జున సీరియస్‌ అయ్యారు.

నాగార్జున మాట్లాడుతూ.. బిగ్‌ బాస్‌ ఇచ్చిన టాస్క్‌ ను బుల్‌ షిట్‌ అని అంటావా ? అంటూ నాగ్ పునర్నవి పై సీరియస్ అయ్యాడు. అలాగే కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టుందని శ్రీముఖి పై కూడా ఫైర్‌ అయ్యాడు. పైగా శ్రీముఖిని ఉద్దేశిస్తూ.. నువ్వు ఈ హౌస్‌ కు బాస్‌ వి అనుకుంటున్నావా ? ఈ హౌస్‌ కు ‘బిగ్‌ బాస్‌’ బాస్‌ అంటూ సీరియస్ గా క్లాస్ పీకాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు