బిగ్ బాస్ 4 – ఈ విషయంలో బాగా విసిగిపోయిన వీక్షకులు.?

Published on Nov 26, 2020 12:00 pm IST

ఒక్క మన తెలుగులోనే కాకుండా న్నీ భాషల్లో కూడా బిగ్గెస్ట్ రియాలిటీ ఏదన్నా ఉంది అంటే అది “బిగ్ బాస్” షో అనే చెప్పాలి. ఇప్పుడు మన తెలుగులో కూడా మొత్తం మూడు సీజన్లలో భారీ రెస్పాన్స్ ను అందుకొని ప్రస్తుతం నడుస్తున్న నాలుగో సీజన్ కూడా మంచి రసవత్తరంగా కొనసాగుతుంది.

అయితే ఈ సారి సీజన్లో విషయంలో స్టార్టింగ్ లో కంటెస్టెంట్స్ విషయంలో అలాగే మంచి మసాలా ఎంటర్టైన్మెంట్ లేదని పెదవి విరిచారు. కానీ ఇప్పుడు మరో విషయంలో బాగా విసుగెత్తిపోయారు. గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు ఇస్తున్న టాస్కులు చూసి విసిగిపోతున్నారు.

అసలు ఇలాంటి టాస్కులు ప్లాన్ చేస్తున్నారేంటి అని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మేజర్ ఆఫ్ వీక్షకుల నుంచి ఇదే మాట వస్తుంది. అలాగే నిన్న జరిగిన దయ్యం ఎపిసోడ్ ను కూడా పెద్దగా హైలైట్ చెయ్యలేదు. మరి ఇప్పుడు షో చివరకు వచ్చేస్తుంది. ఈ కొన్ని రోజుల్లో అయినా సరే మరింత ఇంట్రెస్టింగ్ టాస్కులను ప్లాన్ చేస్తారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More