లేటెస్ట్ : పవన్ కళ్యాణ్ ‘ఓజి’ లో బిగ్ బాస్ 7 బ్యూటీ

Published on Sep 6, 2023 6:03 pm IST

శుభశ్రీ రాయగురు తొలిసారిగా తెలుగు చిత్రసీమకి రుద్రవీణ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. అలానే అటు కోలీవుడ్ లో డెవిల్ మూవీతో తన సినీ ప్రయాణాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం తెలుగులో కథ వెనుక కథ, అమిగోస్ సినిమాల్లో కూడా నటించి తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ నుండి మంచి పేరు ఆమె సొంతం చేసుకున్నారు. ఒడిశా లో నటించిన ఈ బ్యూటీ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న గ్యాంగ్ స్టర్ మూవీ ఓజి లో ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నట్లు తెలిపారు.

అయితే ఆ పాత్ర ఎటువంటిది అనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. ఇక తాజాగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ లో పాల్గొంటున్న శుభశ్రీ తప్పకుండా టైటిల్ గెల్చుకుంటాననే ఆశాభవం వ్యక్తం చేసారు. ప్రస్తుతం బిగ్ బాస్ షో లో తన ఆకట్టుకునే ప్రదర్శనతో ముందుకు సాగుతున్న శుభశ్రీ ఆడియన్స్ నుండి ఎంతమేర ఆడియన్స్ మనసు చూరగొంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :